Wednesday 5 October 2016

చెప్పెవే చెలి..

పల్లవి:
చెప్పెవే చెలి.. మాటాడవే మరి..
ఊఁ అంటావో లేక నో అంటావో..
నీ ఇంటెన్షన్ ఏంటో తెలియక టెన్షన్ పడుతున్నా..
తర్వగా చెప్పవే...
చెప్పెవే చెలి.. మాటాడవే మరి..

చరణం 1:
మనసే సీతాకోకై ఎగిరెనే నిను చూడగానే..
తనువే తాపంతో రగిలెనే నువు తాకగానే..
"నా హృదయవీణనే మీటి ప్రణయరాగాలు పలికించావ్..
నీ కళ్లతోటే కాటేసి  నా కలలలోన దూరేసావ్.." (2)
లాలలా లలా..  చెప్పెవే చెలి..
లాలాలలా లలా.. మాటాడవే మరి..

చరణం2:
రాయంటి నా హృదయం కరిగిందే నీ మాటతోటి..
రేయిపగలు నీ ధ్యానమే ఊపిరైందే నా దేహానికి..
"నా మనసు చెబుతోంది నాకు నేనంటే నీకు ప్రేమేనని..
ఆ ఒక్కమాట చెప్పేసి
నన్నీ చిక్కు నుండి విడిపించవే.." (2)
ఓఒఓ ఓఓ.. చెప్పెవే చెలి..
ఓఓఒఓ ఓఓ.. మాటాడవే మరి..
||చెప్పవే-చెప్పవే||

చెప్పెవే చెలి.. మాటాడవే మరి..